12న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

12న జాతీయ లోక్‌ అదాలత్‌

Sep 8 2026 1:41 AM | Updated on Sep 8 2026 1:41 AM

కర్నూలు(టౌన్‌): జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణాల్లో ఈనెల 12న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వాసు తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్‌ హాలులో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్‌లోనివిల్‌, రాజీ కాదగిన కాంపౌండబుల్‌ క్రిమినల్‌ కేసులు, ఎకై ్సజ్‌ కేసులు, ఫ్యామిలీ కేసులు, చెక్‌బౌన్స్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ కేసులు, 10 సంవత్సరాలు పైబడిన సివిల్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సహకారం అందించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాదర్శి లీలా వెంకట శేషాద్రి, ఉమ్మడి కర్నూలు జిల్లాల న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement