అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

Sep 8 2026 1:41 AM | Updated on Sep 8 2026 1:41 AM

కర్నూలు(సెంట్రల్‌): ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్‌తో పాటు జేసీ నూరుల్‌ ఖమర్‌ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందుతున్న ప్రతి అర్జీని ప్రాధాన్యతతో పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులకు అందించే ఎండార్స్‌మెంట్‌లు స్పష్టంగా, సులభంగా అర్థమయ్యే ఉండాలన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. కార్యక్రమ డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు రామసుబ్బయ్య, అనురాధ, శివప్రసాద్‌ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ ప్రియంవద పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement