కృష్ణగిరి: మండల పరిధిలోని కోయిలకొండ గ్రామంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 18 జట్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు గోపాల్, ఈశ్వర్, గంగాధర్, శ్రీను, రంగనాథ్ తెలిపారు. పోటీలను దాతలు, గ్రామపెద్దలు ఆంజనేయులు, గంగన్న, దస్తగిరి, లక్ష్మి ఈశ్వరయ్య, శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. క్రీడాకారులకు గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


