పిట్ట కొంచెం.. కూత ఘనం. కూతనే కాదు.. దాని నైపుణ్యం ముందు ఇంజినీర్లు సైతం చిన్నబోవాల్సిందే. గిజిగాడు తన గూడు పని తనం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గడ్డి పరకలు, పుల్లలు సేకరించి, ఒక్కొక్క పోచతో ఎంతో శ్రద్ధగా అళ్లే గూళ్లు గొప్ప ఆర్కిటెక్చర్లనే మించిపోతాయి. అలాంటి ఒక్క గూడును చూస్తేనే ఆహా అని మురిసిపోతుంటాం. అలాంటివి పదుల సంఖ్యలో ఒకే చోట కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి. క్రిష్టిపాడు సమీపంలో కుందూనది ఒడ్డున చెట్లకు గూళ్లు ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తికి సిద్ధం అవుతున్నాయి. – దొర్నిపాడు


