జిల్లా వార్షిక రుణ ప్రణాళిక విడుదల | - | Sakshi
Sakshi News home page

జిల్లా వార్షిక రుణ ప్రణాళిక విడుదల

Aug 20 2026 3:52 AM | Updated on Aug 20 2026 3:52 AM

జిల్లా వార్షిక రుణ ప్రణాళిక విడుదల

రూ.22,323.13 కోట్ల

రుణ లక్ష్యం నిర్దేశం

కర్నూలు(సెంట్రల్‌): 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి బుధవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ పి.మోహన్‌ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన రుణ ప్రగతిని, 2026–27 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను, గత ఏడాదితో పోల్చిన మా ర్పులను జిల్లా కలెక్టర్‌కు వివరించారు. ముఖ్యంగా వ్యవసాయ, ఎంఎస్‌ఎంఈ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించేలా బ్యాంకులతో పాటు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. 2026–27 సంవత్సరానికి మొత్తం రూ.22,323.13 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించగా, సుమారు 6,74,445 మంది లబ్ధిదారులకు రుణ ప్రయోజనాలు అందేలా ప్రణాళిక రూపొందించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ శ్రీధర్‌ బాబు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజర్‌ పాండే, కెనరా బ్యాంక్‌ అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement