మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలోని అన్నపూర్ణ భోజనశాలకు బెంగళూరుకు చెందిన అర్జున్ అనే భక్తుడు 120 బస్తాల బియ్యాన్ని బహూకరించారు. బియ్యం ప్యాకెట్లను ప్రత్యేక వాహనంలో శ్రీమఠానికి తీసుకొచ్చారు. శ్రీమఠం పీఠాధిపతికి సుబుధేంద్రతీర్థులు బియ్యం ప్యాకెట్లకు సంప్రోక్షణ చేసి స్వీకరించారు. బియ్యం బస్తాలను ఆరాధన ఉత్సవాలకు అన్నదానానికి ఉపయోగించాలని కోరారు. దాత అర్జున్, ఆయన మిత్రులకు ఫల, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. వేణగోపాల్, సంగమేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా స్వాతి వేడుకలు
బేతంచెర్ల: శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో బుధవారం స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో పండితులు జ్వాలా చక్రవర్తి , కల్యాణ్ చక్రవర్తి శ్రీదేవి పూజలు చేశారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి, మద్దిలేటి నరసింహస్వామికి సహస్రదీపాలంకరణ సేవ కనులపండువగా నిర్వహించారు. అనంతరం ఆలయ మాడ వీధుల్లో గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్య ఉత్సవమూర్లును రమణీయంగా ఊరేగించారు.


