ఎరువులు ఇవ్వరు.. తెచ్చుకుంటే వదలరు! | - | Sakshi
Sakshi News home page

ఎరువులు ఇవ్వరు.. తెచ్చుకుంటే వదలరు!

Aug 20 2026 3:40 AM | Updated on Aug 20 2026 3:40 AM

ఆళ్లగడ్డ: సమయానికి ఎరువులు ఇవ్వకపోగా ఎక్కడి నుంచి అయినా తీసుకొస్తే అధికారులతో వేధించడం పరిపాటిగా మారింది. రుద్రవరం చిత్రేనిపల్లె గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. గ్రామంలో అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడి రైతులు పండించే నంద్యాల సోనా రకం బియ్యానికి డిమాండ్‌ ఉంది. పంట పండించేందుకు ప్రభుత్వం ఎరువుల్లో కనీసం పదిశాతం కూడా సరఫరా చేయలేదు. దీంతో అనేక మంది రైతులు ఏదో విధంగా బస్తాలు సమకూర్చుకుని వాటిని తమ ఇళ్లలో భద్ర పరుచుకున్నారు. ఇది గమనించిన టీడీపీ నాయకులు తమను అడగకుండా ఎలా తెచ్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేయాలని వ్యవసాయాధికారులకు చెబుతున్నారు. టీడీపీ నాయకుల మాటలకు తలొగ్గి రైతుల ఇళ్లపై వ్యవసాయ అధికారులు దాడులు చేస్తున్నారు. ఎరువుల బస్తాలు అక్రమంగా ఉంచారని సీజ్‌ చేస్తున్నారు. అలాగే జరిమానాలు వేస్తున్నారు. టీడీపీ నాయకులతో రాజీ పడాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారు.

పేదోళ్లపై ప్రతాపం

పేద రైతులు తమ ఇళ్లలో పది ఎరువుల బస్తాలు నిల్వ చేసుకుంటే ఇవి ఎక్కడివి అని వ్యవసాయాధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీపీ నాయకుల సంబంధించిన గోదాముల్లో వేలకు వేలు బస్తాలు నిల్వ చేసుకున్నా పట్టించుకోవడం లేదు. తాము దాచుకున్నది పొలానికి అవసరమైన ఎరువుల బస్తాలే కదా.. బెదిరింపులు ఎందుకని రైతులు అంటే ఇందులో తమ పాత్ర లేదని, టీడీపీ నాయకుల ప్రమేయమేనని అధికారులు చెబుతున్నారు. కొందరు రైతులు టీడీపీ నేతలతో రాజీ పడి రూ. 50 వేలు ఇచ్చినట్లు సమాచారం. అధికార పార్టీకి మేలు జరిగేలా సామాన్య రైతులు అఽధికారులు వేధించడం మానుకోవాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

పేద రైతుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు

ఎరువుల బస్తాలు సీజ్‌ చేస్తూ

బెదిరింపులు

టీడీపీ నాయకుల మాట

వినాలని ఒత్తిళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement