ఉచితంగా ఆధునిక దంత వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

ఉచితంగా ఆధునిక దంత వైద్య సేవలు

Mar 6 2026 8:18 AM | Updated on Mar 6 2026 8:18 AM

ఉచితంగా ఆధునిక దంత వైద్య సేవలు ఆధునిక వైద్యంతో అందమైన చిరునవ్వు

ఆసుపత్రిలోని దంత విభాగంలో రోజుకు 50 మంది దాకా ఓపీ రోగులు వస్తారు. వారికి ఆధునిక వైద్యపరికరాలు, ఆధునిక చైర్లపై దంత వైద్యం చేస్తున్నాం. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 నుంచి 4 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. పాడైన దంతాలు, చిగుళ్ల వ్యాధులకు చికిత్స, పిల్లలకు వచ్చే దంత సమస్యలకు, గుట్కా తినడం వల్ల పాడైన దంతాలకు చికిత్స చేయడం, నోటి క్యాన్సర్‌తో బాధపడే వారికి చికిత్స అందిస్తున్నాం.

– డాక్టర్‌ ఆర్‌. విజయకుమార్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, దంత వైద్యవిభాగం,

జీజీహెచ్‌, కర్నూలు

దంత వైద్యచికిత్సలో ఆధునిక వైద్యసదుపాయాలు మరింత మెరుగైన, నాణ్య మైన చికిత్సను రోగులకు అందించేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఒకప్పుడు రూట్‌ కెనాల్‌ ట్రీట్‌మెంట్‌కు నాలుగుసార్లు వైద్యుల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే విజిట్‌లోనే ఈ చికిత్సను పూర్తి చేసే అవకాశం వచ్చింది. ఎత్తు, వంకర పళ్లను సరిచేసేందుకు గతంలో క్లిప్స్‌ ఉపయోగించేవాళ్లం. ఇప్పుడు అలైనర్స్‌ ద్వారా సౌకర్యవంతంగా ఎత్తు, వంకర, సందు పళ్లను సవరించుకోవచ్చు. అల్ట్రాసోనిక్‌ స్కేలింగ్‌ సహాయంతో ఎప్పటికప్పుడు దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. డెంటల్‌ లేజర్స్‌ పరికరం ద్వారా ఇంజెక్షన్స్‌ లేకుండా రక్తస్రావం రాకుండా కుట్లు వేయవచ్చు. – డాక్టర్‌ పి. సునీల్‌కుమార్‌రెడ్డి,

డెంటల్‌ సర్జన్‌, కర్నూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement