డీసీసీబీని అభివృద్ధి పథంలో నిలుపుదాం | - | Sakshi
Sakshi News home page

డీసీసీబీని అభివృద్ధి పథంలో నిలుపుదాం

Mar 6 2026 8:18 AM | Updated on Mar 6 2026 8:18 AM

డీసీసీబీ సీఈఓ శివలీల

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా సహకార కేంద్రబ్యాంకును మరింత అభివృద్ధిలోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి (సీఈఓ) కొమ్మ శివలీల అన్నారు. గురువారం డీసీసీబీ సీఈఓగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు డీసీసీబీ జనరల్‌ మేనేజర్‌ అయిన పి.రామాంజనేయులు పూర్తి అదనపు బాధ్యతలతో సీఈఓగా ఉన్నారు. ఆప్కాబ్‌ కొన్ని నెలల క్రితం డీసీసీబీకి రెగ్యులర్‌ సీఈఓను నియమించుకునేందుకు 11 మందితో కూడిన ప్యానల్‌ను పంపింది. ఈ మేరకు డీసీసీబీలో జీఎంగా విధులు నిర్వహిస్తున్న శివలీల కూడా ప్యానల్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్యానల్‌లో ఉన్న శివలీలను సీఈఓగా నియమిస్తూ డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత ఇన్‌చార్జీ సీఈఓ నుంచి రెగ్యులర్‌ సీఈఓగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. సీనియర్‌ అధికారులు, ప్రధాన కార్యాలయం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాలు వివరించారు. సమష్టిగా పనిచేసి డీసీసీబీని మరింత అభివృద్ధ్దిలోకి తీసుకురావాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో జీఎం పి.రామాంజనేయులు, డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్‌కుమార్‌, ఏజీఎం త్రినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement