క్యాన్సర్ గుర్తింపు స్క్రీనింగ్‌తోనే సాధ్యం
మద్దికెర: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్‌తో క్యాన్సర్ పరీక్షలు చేయాలని జిల్లా ఎన్‌సీడీ, బాలస్వస్థ కార్యక్రమం నోడల్ అధికారి డాక్టర్ మహేశ్వర ప్రసాద్ అన్నారు. గురువారం స్థానిక ప్రాథమిక వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మండలంలో జరుగుతున్న ఎన్‌సీడీ సర్వే సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్త్ ప్రొవైడర్లు, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు టీమ్‌లుగా ఏర్పడి ఇంటి వద్దనే ప్రతి ఒక్కరికీ ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయాలని సూచించారు. ముందస్తు పరీక్ష ద్వారా క్యాన్సర్ నంచి రక్షణ పొందవచ్చన్నారు. రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భశాయ, ముఖద్వారా క్యాన్సర్‌లపై స్క్రీనింగ్ చేయాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలోనే ప్రసవాలు నిర్వహించాలని ఆయుష్మాన్, ఆరోగ్య మందిరాలలో సేవలు మెరుగుపరచాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు శ్రీలక్ష్మి, రాగిణి, జిలాని బాషా, సీహెచ్‌ఓ నిరంజన్‌బాబు, డీహెచ్‌ఈఓ అక్బర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.


