లారీ డ్రైవర్‌కు ఏడాది జైలు
కర్నూలు: లారీని అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి రైల్వే పోలీసు మృతికి కారణమైన ఐచర్ వాహన డ్రైవర్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు ఎకై ్సజ్ కోర్టు మెజిస్ట్రేట్ ఎస్.అనిల్ కుమార్ శుక్రవారం తీర్పు చెప్పారు. కర్నూలు నగరంలోని అపూర్వ విల్లాస్‌లో నివాసముంటున్న రైల్వే పోలీసు మేకల వెంకటేశ్వర్లు (56) తన సోదరుడు మేకల శ్రీనివాసులు 2017 డిసెంబర్ 8వ తేదీన మధ్యాహ్నం జాతీయ రహదారిపై వెళ్తుండగా వెనుక వైపు నుంచి వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి వెంకటేశ్వర్లు మోటర్‌సైకిల్‌ను ఢీకొట్టగా ఎగిరి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మేకల శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాజ్ జిల్లా కేడా గ్రామానికి చెందిన నిందితుడు జితేంద్రపై అభియోగ పత్రాలు దాఖలు చేశారు. కేసు విచారణ డ్రైవర్ జితేంద్రపై నేరం రుజువు కావడంతో జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ గోపాలకృష్ణ వాదించారు. తీర్పు అనంతరం నిందితుడిని కర్నూలు సబ్ జైలుకు తరలించినట్లు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు.


