ఉపాధిలో లోటుపాట్లు సరిదిద్దుకోకపోతే చర్యలు
దొర్నిపాడు: ఉపాధి పనుల్లో జరుతున్న లోటుపాట్లను సిబ్బంది సరిదిద్దుకోవాలని, లేకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ సూర్యనారాయణ హెచ్చరించారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31వరకు రూ. 5,22,88,956 పనులు చేశారు. దీంతో పనులకు సంబంధించి స్థానిక ఉపాధిహామీ కార్యాలయ ఆవరణలో 19వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అపరాధ రుసుము, కూలీల అదనపు చెల్లింపులకు సంబంధించి రూ.40,085 రికవరీ చేశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఉపాధి పనుల్లో అక్రమాలకు తావు లేకుండా చూడాలన్నారు. జాబ్‌కార్డు కల్గిన శ్రామికులందరికీ పనులు కల్పించాలన్నారు. పనులకు హాజరు కాకపోయినా హాజరు వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనులు జరిగే సమయంలో ఏపీఓల పర్యవేక్షణ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏవీఓ పరమేశ్వరుడు, ఏపీఈ(డీవీవో సెక్షన్) రాజశేఖర్‌రెడ్డి, ఎంపీడీఓ సావిత్రి, ఏపీడీ సాంబశివరావు, ఏపీఓ హనీఫా ఎస్‌ఆర్‌పీ లక్ష్మీనారాయణ, డీఆర్‌పీలు రవి, రవికుమార్, బోస్ తదితరులు పాల్గొన్నారు.


