వృద్ధాప్యంలో మూత్రాశయ సమస్యలు
వృద్ధాప్యంలో చాలా మందికి మూత్రనాళ సమస్యలు సహజం. కొందరు మూత్రాన్ని ఆపుకోలేక మధ్యలోనే పోసుకోనే ఇబ్బంది తలెత్తోంది. కొందరు ప్రొస్టేట్ వాపు తరచూ మూత్ర విసర్జన చేస్తుంటారు. కొన్నిసార్లు ఇది ప్రోస్టేట్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ఇలాంటి సమస్యలున్న వారిని ఆదరించాలి. వైద్యులను సంప్రదించి చికిత్స చేయించాలి. మందులను రెగ్యులర్‌గా వాడుతూ ఉంటే మూత్ర సమస్యలు పరిష్కారం అవుతాయి. వారు మూత్రానికి బాత్‌రూమ్‌కు వెళ్లే సమయంలో ఒకరు తోడుండాలి. లేకపోతే వారు బాత్‌రూమ్‌లో జారిపడే అవకాశం ఉంటుంది. – డాక్టర్ అబ్దుల్ సమద్, యూరాలజిస్టు, కర్నూలు


