కొనసాగుతున్న వలసలు
కోసిగి: పనులు లేకపోవడంతో వివిధ గ్రామాల నుంచి ప్రజలు వలస వెళ్తున్నారు. ఆదివారం కొల్మాన్‌పేట, కామన్‌దొడ్డి, తిప్పల దొడ్డి, వందగల్లు, కందుకూరు గ్రామాల నుంచి ఆరు బొలెరో లు, రెండు డీసీఎంలలో దాదాపు 250 మందికి పైగా కూలీలు తరలి వెళ్లారు. ఇళ్ల తాళాలు వేసి మూటా ముళ్లసర్దుకుని పిల్లలపాపలతో తరలి వెళ్లారు. విద్యార్థులను బడి మానిపించి తమ వెంట తీసుకెళ్లారు. కూలీలు అత్యధికంగా గుంటూరు, వినుకొండ, విజయవాడ వైపు వెళ్లారు. అక్కడ మిరప పొలాల్లో పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు.
మద్యం మత్తులో వాగులో పడి మృతి
● ప్రమాదాన్ని దాచిన స్నేహితుడు
నందికొట్కూరు: గుర్తు తెలియని వ్యక్తి మృతి కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 18వ తేదీన బ్రాహ్మణకొట్కూరు పంప్‌హౌస్ వద్ద లభించిన గుర్తు తెలియని మృతదేహం పాములపాడు మండలం మిట్టకందాల గ్రామానికి చెందిన లింగాల ఏసేపుగా తేలింది. రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఆదివారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 15వ తేదీన గ్రామం నుంచి లింగాల ఏసేపు, అదే గ్రామానికి చెందిన ధర్మతేజ ఇద్దరు కలిసి నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి స్నేహితుల వద్దకు మద్యం తాగేందుకు వెళ్లారు. మద్యం మత్తులో అల్లూరు నుంచి రాత్రి 8 గంటల సమయంలో బైక్‌పై మిట్టకందాలకు బయల్దేరారు. మార్గమధ్యలో అల్లూరు సమీపంలోని హంద్రీనీవా కాల్వ బ్రిడ్జి వద్ద బైక్ అదుతప్పింది. ఈ ప్రమాదంలో ధర్మతేజ గట్టున పడగా, బైక్‌తోపాటు ఏసేపు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ధర్మతేజ దాచిపెట్టాడు. ఈ క్రమంలో ఏసేపు మృతదేహాన్ని లభించడం, పోలీసులు కర్నూలు మార్చురీకి తరలించి భద్రపరిచారు. అయితే ఏసేపు కుటుంబీకులు ఆచూకీ కోసం గాలిస్తూ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గుర్తు తెలియని మృతదేహం గురించి వివరించి గుర్తించమని చెప్పడంతో కేసు మిస్టరీ వీడింది. ప్రమాద విషయం దాచినపెట్టిన ధర్మతేజపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు.
కొనసాగుతున్న వలసలు


