కమనీయం.. రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. రథోత్సవం

Jan 26 2026 4:14 AM | Updated on Jan 26 2026 4:14 AM

కమనీయ

కమనీయం.. రథోత్సవం

నందికొట్కూరు: శ్రీఛాయ ఉషా సమేత సూర్యభగవానుడి రథోత్సవం కనులపండువగా సాగింది. దాదాపు వెయ్యేళ్ల క్రితం నిర్మితమైన పట్టణంలోని సూర్య నారాయణ స్వామి ఆలయంలో రథ సప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు భరత్‌కృష్ణ శర్మ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమాలు, కుంకుమార్చనలు, అష్టోత్తర పుష్పార్చనలు చేపట్టారు. అనంతరం చిత్తూరు సురేష్‌కుమార్‌ శర్మ, నాగభూషణం శర్మ ఆధ్వర్యంలో కల్యాణాన్ని నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు సూర్య నారాయణ స్వామి వారి కల్యాణంలో పాల్గొన్నారు. పురవీధుల వెంట కల్యాణ ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపట్టారు. సాయంత్రం భక్తజనం మధ్య రథోత్సవం కొనసాగింది. రథంలో కొలువైన స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు.

కమనీయం.. రథోత్సవం1
1/1

కమనీయం.. రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement