వ్యక్తిపై పోక్సో కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

Jan 26 2026 4:14 AM | Updated on Jan 26 2026 4:14 AM

వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

కోడుమూరు రూరల్‌: గూడూరు మండలంలోని పొన్నకల్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై పొక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గూడూరు ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప ఆదివారం విలేకరులకు తెలిపారు. పొన్నకల్‌కు చెందిన ఓ బాలిక ఈనెల 18నుంచి కనిపించకుండా పోయింది. దీంతో బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా, ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. దీంతో బాలిక ఇచ్చిన వాంగ్మూలం మేరకు నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఓర్వకల్లు: సోమయాజులపల్లె ఘాట్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాంలో ఓ మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగరలో నివాసముంటున్న షేక్‌ వలిబాషా తన భార్య బోయ శాంతి (38)తో కలసి వ్యక్తిగత పనిమీద కర్నూలుకు బైక్‌పై బయలుదేరారు. పని ముగించుకొని తిరిగివెళ్తుండగా సోమయాజులపల్లె ఘాట్‌ రోడ్డులో వారి బైక్‌ తప్పింది. బైక్‌పై కూర్చున్న శాంతికి తీవ్రగాయాలు కావడంతో అంబులెన్స్‌లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శాంతి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement