విద్యుదాఘాతంతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Jan 25 2026 7:06 AM | Updated on Jan 25 2026 7:06 AM

విద్య

విద్యుదాఘాతంతో రైతు మృతి

మహానంది:మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందా డు. శనివారం ఆంజనేయపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. మహానంది మండలం గాజులపల్లెకు చెందిన కొలిమి మత్తూమ్‌(64) ఆంజనేయపురం సమీపంలోని పొలంలో మొక్కజొన్న సాగు చేస్తున్నా డు. సోలార్‌తో పాటు ఓ బల్బు కోసం విద్యుత్‌ వైరు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పటిలాగే ఆయన పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లగా తీగను గమనించలేదు. ఆ తీగ కాస్త సోలార్‌పై పడటంతో ప్రమాదవశాత్తూ ఆ విద్యుత్‌ సరాఫరా కావడంతో మత్తూమ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన రైతుకు భార్య కొలిమి రమీజా ఉండగా ఇద్దరు పిల్లలకు వివాహాలు చేశారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న విద్యుత్‌ శాఖ ఏఈఈ ప్రభాకర్‌రెడ్డి, సిబ్బంది ఘటనా స్థలం వద్దకు చేరుకుని పరిశీలించారు. తీగ డ్యామేజీని గుర్తించినట్లు చెప్పారు.

జాతీయస్థాయి

రగ్బీ పోటీలకు ఎంపిక

కృష్ణగిరి: స్థానిక కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కే. విశాలక్ష్మి అండర్‌–19 విభాగంలో జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ చైతన్యస్రవంతి తెలిపారు. గతేడాది నవంబర్‌ 23న కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ప్రతిభ కనబరచడంతో జాతీయ పోటీలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈ నెల 27 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థిని పాల్గొంటారన్నారు. ఎంపికై న విద్యార్థిని విశాలక్ష్మి, పీఈటీ సుప్రియను శనివారం ఉపాధ్యాయ బృందంతో కలిసి ఆమె అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనపరిచి మంచి పేరు తీసుకరావాలని ఆమె ఆకాంక్షించారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి 1
1/1

విద్యుదాఘాతంతో రైతు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement