చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
● దోచుకోవడం..దాచుకోవడమే
టీడీపీ నేతల నైజం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్‌రెడ్డి
కోడుమూరు రూరల్: చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలంతా వ్యతిరేకతతో ఉన్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ముగిసిపోయిందని, ఆ పార్టీ నాయకులంతా ఇప్పటికే తట్టాబుట్టా సర్దుకుంటున్నారన్నారు. కోడుమూరులో ఎస్‌ఈసీ సభ్యులు కోట్ల హర్షవర్దన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్‌ల ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ము ఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణు క, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఫిబ్రవరి 15లో గా ప్రతి గ్రామంలోనూ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ సభ్యత్వం ఉన్నవారికి గుర్తింపు కార్డును ఇస్తామన్నారు.
సీమ ప్రయోజనాలను
తెలంగాణకు తాకట్టు
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వడంలో చంద్రబాబు ప్రభుత్వ ఘోరంగా విఫలమైందని ఎస్వీ విమర్శించారు. జగనన్న పాలనలో ప్రతి రైతుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, యూరియా అందుబాటులో ఉండేవని, నేడు ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఒక యూరియా బస్తా కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, సీమ ప్రజల ప్రయోజనాలను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ హయాంలో భూముల రీసర్వే నిర్వహిస్తే జగనన్న లాక్కూంటున్నాడంటూ ఆరోపణలు చేసి రైతులను తప్పుదోవ పట్టించిన సీఎం చంద్రబాబు నేడు మళ్లీ భూముల రీసర్వే నిర్వహిస్తూ క్రేడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు.
కార్యకర్తలే పార్టీకి పునాదులు
వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే పునాదని పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న సీఎం చంద్రబాబు గుండ్రేవుల ప్రాజెక్టు కోసం రూ.5వేల కోట్లను ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ నిత్యం పోరాటాలు చేస్తోందన్నారు. సమావేశంలో గూడూరు ఎంపీపీ సునీత, మున్సిపల్ చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్లు రమేష్‌నాయుడు, రామాంజినేయులు, సోమశేఖర్‌రెడ్డి, మోహన్‌బాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పాటిల్ హనుమంతరెడ్డి, లాయర్ ప్రభాకర్, జిల్లా కార్యదర్శులు కొంతలపాడు శ్రీనివాసరెడ్డి, శివరాముడు, అధికార ప్రతినిధి పోలకల్ ప్రభాకర్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి డీలర్ క్రిష్ణారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గౌతమ్, మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం బాషా, నియోజకవర్గ అధ్యక్షులు బందెనవాజ్, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు మధు శేఖర్, ఆయా మండలాల అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత


