26న పీజీఆర్‌ఎస్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

26న పీజీఆర్‌ఎస్‌ రద్దు

Jan 25 2026 7:02 AM | Updated on Jan 25 2026 7:02 AM

26న ప

26న పీజీఆర్‌ఎస్‌ రద్దు

కర్నూలు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న(సోమవారం) నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ శనివారం వేర్వేరు ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలతో జిల్లా కేంద్రానికి రా వొద్దని, ఈ విషయాన్ని గమనించాలన్నారు.

రూ.10 వేలు దాటిన వేరుశనగ ధర

కర్నూలు(అగ్రిల్చర్‌): వేరుశనగ ధరలకు రెక్కలొచ్చాయి. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యా ర్డుకు శనివారం 241 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. కనిష్ట ధర రూ.5,699, గరిష్ట ధర రూ.10,202 లభించింది. సగటు ధర రూ.9,869 నమోదైంది. ఉమ్మడి జిల్లాలో వేరుశనగ సాగు తగ్గిపోయింది. ఇందువల్ల మార్కెట్‌లో వేరుశనగకు కొరత ఏర్పడుతోంది. డిమాండ్‌కు తగినట్లు వేరుశనగ సరఫరా లేకపోవడం వల్ల ధర పెరుగుతోంది. ఈ నెల 23న గరిష్టంగా రూ.9,519 ధర లభించింది. తాజాగా రూ.10,202 లభించింది. ఒక్కరోజులోనే క్వింటాపై రూ.683 పెరుగుదల ఉండటం విశేషం. చంద్రబాబు ప్రభుత్వం 2024–25, 2025–26 రబీ సీజన్‌లలో వేరుశనగ సబ్సిడీపై పంపిణీ చేయకపోవడమే వేరుశనగకు కొరతకు కారణమవుతోంది.

పోలీసుల విస్తృత తనిఖీలు

కర్నూలు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు కర్నూలులో ముందస్తు తనిఖీలు నిర్వహించారు. ప్రజ ల భద్రతే లక్ష్యంగా కర్నూలు బస్టాండ్‌లోని పా ర్సిల్‌ కార్యాలయాలు, వాహన పార్కింగ్‌ ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ బాబు ప్రసాద్‌, సీఐలు విక్రమసింహ, చంద్రబా బు నాయుడు, నాగరాజరావు ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్‌తో పాటు రైల్వే స్టేషన్‌లో డాగ్‌ స్క్వాడ్‌, స్పెషల్‌ పార్టీ బృందాలతో తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్‌ పార్సిల్‌ కార్యాలయాలు, వెయిటింగ్‌ హాల్‌, ప్లాట్‌ఫారం, రైలు భోగీల్లోని ప్రయాణికుల బ్యాగులను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అసాంఘిక శక్తుల అణచివేతే లక్ష్యంగా ముందస్తు తనిఖీలు చేపడుతున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.

సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్‌ పరీక్షలు

కర్నూలు సిటీ: సీసీ కెమెరాల నిఘాలోఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించాలని ఆర్‌ఐఓ జి.లాలెప్ప, జాల్లా వృత్తి విద్యాధికారి డా.సురేష్‌ బాబు సూచించారు. కర్నూలు ప్రభుత్వ జూనియర్‌(టౌన్‌ మోడల్‌)కాలేజీలో ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణపై చీఫ్‌ సూపరింటెండెట్లు, ఎగ్జామినర్లకు శనివారం ఒక రోజు ఓరియెంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకేషనల్‌ విద్యార్థులకు ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు మొదటి, ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు రెండో, 6 నుంచి 10వ తేదీ వరకు మూడో స్పెల్‌ పరీక్షలు ఉంటాయన్నారు. జనరల్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు మొదటి, 6 నుంచి 10వ తేదీ వరకు రెండో స్పెల్‌ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. సమావేశంలో పరీక్షల కమిటీ సభ్యులు నాగభూషణ్‌ రెడ్డి, ప్రసాద్‌, సురేష్‌ చంద్ర, మల్లికార్జునరావు, టౌన్‌ మోడల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

26న పీజీఆర్‌ఎస్‌ రద్దు  1
1/1

26న పీజీఆర్‌ఎస్‌ రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement