విజయ డెయిరీ చైర్మన్‌కు సన్మానం | - | Sakshi
Sakshi News home page

విజయ డెయిరీ చైర్మన్‌కు సన్మానం

Jan 25 2026 7:02 AM | Updated on Jan 25 2026 7:02 AM

విజయ డెయిరీ చైర్మన్‌కు సన్మానం

విజయ డెయిరీ చైర్మన్‌కు సన్మానం

నంద్యాల(అర్బన్‌): అధికారంలో ఉన్న టీడీపీ నేతలు కుట్రలు చేసినా విజయ డెయిరీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అద్వితీయ విజయం సాధించింది. విజయ డెయిరీ చైర్మన్‌గా ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి రెండో సారి ఎన్నికయ్యారు. కర్నూలులో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో 12 మంది డెయిరీ డైరెక్టర్లు.. ఏకగ్రీవంగా ఎన్నికై న చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. తొలిసారి 2021 జనవరిలో, ప్రస్తుం రెండో సారి ఎన్నిక కావడంపై డైరెక్టర్లు, డెయిరీ ఎండీ ప్రదీప్‌కుమార్‌ చైర్మన్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా డెయిరీ చైర్మన్‌ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది డిసెంబర్‌ 15న 12 మంది డైరెక్టర్లు తనను చైర్మన్‌గా ఎన్నుకున్నారన్నారు. ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికలు ఉన్నందున చైర్మన్‌ ఎన్నికను ప్రకటించలేదన్నారు. నామినేషన్లు వాయిదా పడటంతో డైరెక్టర్లు తనను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement