పాఠశాలలను మూసివేయడం సరికాదు
ఆదోని సెంట్రల్: పిల్లలు తక్కువగా ఉన్నారని పాఠశాలలను మూసివేయడం తగదని బహుజన్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ అన్నారు. ఆదివారం బీటీఏకు సంబంధించిన నూతన డైరీ, క్యాలెండర్లను ఆదివారం ఉప విద్యాధికారి రాజేంద్ర ప్రసాద్, మండల విద్యాధికారులు భూపాల్ రెడ్డి, శ్రీనివాసులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఇప్పటికే ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగించడం ద్వారా బోధన కుంటుపడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పీపీపీ అనే మంత్రం జపిస్తుందని ఇది ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో బీటీఏ నాయకులు జయరాం, చంద్రశేఖర్, కేసన్న, రాము, లక్ష్మన్న, రామన్న తదితరులు పాల్గొన్నారు.


