ఓవైపు ఆదోని.. మరో వైపు ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరుటౌన్: జిల్లాలోని పశ్చిమ ప్రాంత అభివృద్ధికి ఆదోనిని జిల్లా కేంద్రం చేయాలంటూ పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్‌లో విద్యార్థి, యువజన ,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు ఆదివారం నాటికి 27వ రోజుకు చేరుకున్నా యి. అయితే ఇందుకు భిన్నంగా ఆదోని డివిజన్ లోని ఎమ్మిగనూరునే జిల్లాగా చేయాలని కోరుతూ మరో విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సోమప్ప సర్కిల్‌లో రిలేదీక్షలను ఆదివారం ప్రారంభించారు. జేఏసీ నాయకు లు రాజేష్, రంగయ్య, చిన్నిప్రసాద్, లక్ష్మణ్, చార్లెస్‌లు దీక్షలు కూర్చున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో ఆదోని, ఎమ్మిగనూరులను జిల్లా కేంద్రాలుగా రెండు జేఏసీలు డిమాండ్ చేస్తుండటంతో ప్రజలు అయోమయంలో పడిపోయారు.


