మల్లన్నకు నృత్య నీరాజనం | - | Sakshi
Sakshi News home page

మల్లన్నకు నృత్య నీరాజనం

Jan 5 2026 10:58 AM | Updated on Jan 5 2026 10:58 AM

మల్లన

మల్లన్నకు నృత్య నీరాజనం

శ్రీ మఠంలో శ్రీ సిద్ధగంగ మఠం పీఠాధిపతి వేడుకల్లో పాల్గొన్నసిబ్బందిని తొలగిస్తాం ● మల్లికార్జున సత్రం అధ్యక్షుడు శ్యాంసుందర్‌

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలయ నిత్య కళావేదికపై హైదరాబాద్‌కు చెందిన నటరాజ కూచిపూడి సంగీత కళాక్షేత్రం వారి సంప్రదాయ నృత్య ప్రదర్శన భక్తులను ఆట్టుకుంది. కార్యక్రమంలో మూషికవాహన, భో....శంభో, కాలభైరవాష్టకం, నాగస్తుతి ఓం నమశ్శివాయ తదితర గీతాలకు సంజన, సనంద, భవ్య తదితరులు నృత్యం ప్రదర్శించారు.

మంత్రాలయం: ప్రముఖ పుణ్యకేత్రంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందవనాన్ని కర్ణాటక రాష్ట్రం తుమ్ముకూరుకు చెందిన శ్రీసిద్ధగంగ మఠం పీఠాధిపతి శ్రీ సిద్ధలింగేశ్వర మహాస్వామిజీ దర్శించుకున్నారు. పీఠాధిపతికి పూర్ణా కలశంతో శ్రీ మఠం అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దేవిని దర్శించుకుని కుంకుమార్చన చేసి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వాముల మూలబృందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం గోశాలను సందర్శించారు. కార్యక్రమంలో శ్రీ మఠం మేనేజర్‌ శ్రీనివాసులు, ధార్మిక అధికారి శ్రీపతి పాల్గొన్నారు.

శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని మల్లికార్జున నిత్యాన్నదాన సత్రంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న సత్రం సిబ్బందిని తొలగిస్తున్నట్లు సత్రం అధ్యక్షుడు ఎం. శ్యాంసుందర్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డిసెంబర్‌ 31వ తేదీన సత్రంలో మేనేజర్‌ లేకపోవడంతో మిగిలిన సత్ర సిబ్బంది, యాత్రికులు నూతన వేడుకల్లో కేక్‌ కట్‌ చేసి, సినిమా పాటలతో చిందులు వేసినట్లు తన విచారణలో తేలిందన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేవ దాయ చట్టం నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ చేస్తామన్నారు. అలాగే శాంతి పరిహారంగా సత్రంలో హోమం నిర్వహించబోతున్నట్లు తెలిపారు.

దివ్యాంగ విద్యార్థులు చదువులో రాణించాలి

ఆదోని రూరల్‌: దివ్యాంగ విద్యార్థులు చదువులో రాణించాలని, అలాంటి వారికి మంచి భవిష్యత్‌ ఉంటుందని ఆదోని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.అర్చన అన్నారు. ఆదివారం మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని పట్టణంలో తిరుమలనగర్‌లోని భవిత స్కూల్‌లో నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ దివ్యాంగులైన పిల్లలను వారి తల్లిదండ్రులు ఎలాంటి వ్యత్యాసాలు చూపకుడా, చదివించాలన్నారు.

మల్లన్నకు నృత్య నీరాజనం 1
1/3

మల్లన్నకు నృత్య నీరాజనం

మల్లన్నకు నృత్య నీరాజనం 2
2/3

మల్లన్నకు నృత్య నీరాజనం

మల్లన్నకు నృత్య నీరాజనం 3
3/3

మల్లన్నకు నృత్య నీరాజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement