బొకేలకు దూరంగా..
గ్రీట్ విత్ గ్రీన్‌పై ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. బొకేలకు బదులుగా మొక్కలు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గురువారం నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఉన్నతాధికారులకు కింది స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులకు వారి అనుచరులు, ఇతర ప్రజలు పూల మొక్కలు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం పర్యావరణానికి శుభ సూచకం అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఖరీదైన బొకేలు, బహుమతులకు బదులుగా ప్రతి ఒక్కరూ మొక్కలు లేదా పేద విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, స్కూలు బ్యాగులు, పెన్సిళ్లు, పెన్నులను ఇచ్చి శుభాకాంక్షలు తెలపాలని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కోరారు. వారి పిలుపు మేరకు ఈ నూతన సంవత్సరం కొత్త ఒరవడికి నాంది పలికింది. అభిమానం కోసం ఖరీదైన వస్తువులకు బదులుగా పేదలు వినియోగించేందుకు అవసరమైన పుస్తకాలు, బట్టలను వితరణ చేయడం విశేషం.
బొకేలకు దూరంగా..
బొకేలకు దూరంగా..


