లక్ష్యాల సాధనకు శ్రమించాలి
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీలో గురువారం ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ ఇన్‌చార్జీ వీసీ ఆచార్య వెంకట బసవరావు, రిజిస్ట్రార్ జి శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2026 సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో లక్ష్యాల సాధన సంవత్సరంగా నిలివాలని ఆకాంక్షించారు. ఈ మేరకు లక్ష్యాల సాధనకు శ్రమించాలన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి 12బి ప్రణాళిక గురించి వివరించారు. బోధనలో ఎంతో అనుభవం కలిగిన అధ్యాపకులు ఉండడంతో భవిష్యత్తులో క్లస్టర్ యూనివర్సిటీ అనేది ఒక ఉన్నత విద్యాలయంగా మారుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ అనుబంధ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఎం శ్రీనివాస్, వెంకటరెడ్డి, జి శ్రీనివాస్, డీన్స్ నాగరాజు శెట్టి, అక్తర్ భాను, మహమ్మద్ వాహిజ్, ఓఎస్డీ ఎస్.ఎం భాష, వింధ్య వాసిని, తదితరులు పాల్గొన్నారు.


