మల్లన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

మల్లన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

Jan 2 2026 11:24 AM | Updated on Jan 2 2026 11:24 AM

మల్లన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

మల్లన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

శ్రీశైలంటెంపుల్‌: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గురువారం రాత్రి మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి దంపతులకు రాజగోపురం వద్ద దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో హైకోర్టు న్యాయమూర్తి దంపతులకు పండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకు లు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన అధికారులు స్వామివారి శేషవస్త్రాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement