హోరాహోరీగా బండలాగుడు పోటీలు
చాగలమర్రి: మండలంలోని మూడురాళ్లపల్లె గ్రామ సమీపంలో ఎద్దుల బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. వివిధ జిల్లాల నుంచి సుమారు 10 జతల వృషభాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.అంబాపురం శ్రీఅభయాంజనేయస్వామి విగ్రహ ప్రథమ ప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఆర్గనైజర్ పూలి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. మొదటి స్థానంలో మద్దిరాళ్ల గ్రామానికి చెందిన శేషాద్రి చౌదరి వృషభాలు నిలువగా రూ.50 వేలు బహుమతి, రెండవ స్థానంలో రాయవరం గ్రామానికి చెందిన రామచంద్రరెడ్డి వృషభాలు నిలువగా రూ.40వేలు బహుమతి, మూడవ స్థానంలో చర్లోపల్లె గ్రామానికి చెందిన చంద్ర ఓబుల్‌రెడ్డి ఎడ్లు నిలువగా రూ.30 వేలు, నాలుగో స్థానంలో కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన విజయకుమార్‌రెడ్డి ఎడ్లు నిలువగా రూ.20వేలు, ఐదవ స్థానంలో రాచమల్లు అనిల్ కుమార్‌రెడ్డి ఎడ్లు నిలువగా రూ.10 వేలు అందజేశారు. అలాగే 6, 7, 8, 9 స్థానా ల్లో నిలిచిన ఎడ్ల యజమానులకు వరుసగా రూ. 8 వేలు, రూ. 6 వేలు, రూ. 5 వేలు, రూ. 4 వేలు అందజేశారు. వ్యాఖ్యాతగా సదా శివారెడ్డి వ్యవహరించారు.


