రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
నందికొట్కూరు: పట్టణంలోని వాల్మీకి నగర్‌కు చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ ఓబులేసు తెలిపిన వివరాల మేరకు. నారాయణ, రమణమ్మ దంపతులకు నలుగురు సంతానం. మూడోవ కుమారుడు వెంకటేశ్వర్లు(34) కార్తీక మాసం చివరి రోజు కావడంతో శుక్రవారం మహానంది పుణ్య క్షేత్రానికి బయలుదేరాడు. ఇంటి నుంచి వెళ్లిన అరగంటలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. మార్గమధ్యలో మిడుతూరు మండలం తలముడిపి గ్రామ బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడి అన్న శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్ని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు. జిందాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన లారీలు నిత్యం వేగంగా , అధిక లోడుతో వెళ్లడంతో రోడ్లు గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


