యువకుడి బలవన్మరణం
పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. గౌరినాఽథ్, లక్ష్మీదేవి దంపతుల కుమారుడైన భవానీప్రసాద్(23)కు గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్ల వద్ద చికిత్స పొందినా నయం కాకపోవంతో మనస్తాపంతో శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు ఓ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
పాణ్యం: పాణ్యంలోని స్టీల్‌ప్లాంట్ వద్ద గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురి వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో చాగలమర్రిలోని చిన్న మకన్మన్ వీధికి చెందిన ముల్లా వసీం ఆక్రమ్, ఆళ్లగడ్డలోని గడ్డంవీధికి చెందిన లంక అలెగ్జాండర్, కుమ్మరిదొడ్డి వీధి అవుకు పట్టణం(ప్రస్తుతం బనగానాపల్లెలో ఉంటున్నారు)కు చెందిన బురుగుల మనోహర్ ఉన్నట్లు చెప్పారు. మొత్తం రెండు కేజీల గంజాయి, ఒక పల్సర్ బైక్, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి, ట్రైనీ ఎస్‌ఐ ధనుజంయ, సిబ్బంది పాల్గొన్నారు.
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
డోన్ టౌన్: వ్యాపారం, కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే ఎస్‌ఐ బింధుమాధవి తెలిపిన వివరాల మేరకు.. నందికొట్కూరు పట్టణం బుడగ జంగాల కాలనీకి చెందిన శ్రీనివాసులు (30) అనే వ్యక్తి గ్యాస్ స్టౌవ్‌లు రిపేరి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో దాదాపు రూ.10 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిపారు. అప్పులు తీర్చలేక బైకుపై డోన్ ప్రాంతానికి వచ్చి డోన్ – చిన్న మల్కాపురం రైల్వే స్టేషన్‌ల మధ్య బైకును ట్రాక్ పక్కన నిలిపి గూడ్స్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గూడ్సు లోకో ఫైలెట్ సమాచారం మేరకు రైల్వే ఎస్‌ఐ సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి ఆచూకీ గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.
యువకుడి బలవన్మరణం


