
కొర్ర సాగు తగ్గింది
ఈ ఏడాది కొర్రసాగుపై రైతులు ఆసక్తి చూపలేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి కొర్ర సాగు తగ్గింది. సబ్సిడీపై పంపిణీ చేసేందుకు కొర్ర విత్తనాలను రైతులకు అందుబాటులో పెట్టినప్పటికీ తీసుకునేందుకు ముందుకు రాలేదు.
– పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు
మేం రాయలసీమ విత్తన సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి చిరుధాన్యాల సాగును ప్రత్యేకంగా చేపట్టాం. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంది. 2023–24 వరకు చిరుధాన్యాలను విదేశాలకు ఎగుమతులకు అవకాశం ఉండేది. మేం ప్రతి నెలా 2–4 క్వింటాళ్ల వరకు విదేశాలకు ఎగుమతి చేశాం. అయితే 2024–25 నుంచి విదేశాలకు ఒక్క కిలో కూడా ఎగుమతి చేయలేని పరిస్థితి ఏర్పడింది. చిరుధాన్యాలకు సిరిధాన్యాలుగా ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలు లేవు. ఇప్పటికై న రాయితీలు ఇవ్వాలి. – వేణుబాబు, మిల్లెట్ రైతు, కర్నూలు