షెడ్లతో ‘కూటమి’ వ్యాపారం! | - | Sakshi
Sakshi News home page

షెడ్లతో ‘కూటమి’ వ్యాపారం!

Aug 18 2025 11:59 AM | Updated on Aug 18 2025 11:59 AM

షెడ్లతో ‘కూటమి’ వ్యాపారం!

షెడ్లతో ‘కూటమి’ వ్యాపారం!

కర్నూలు(అగ్రికల్చర్‌): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా అభివృద్ధి పనులు లేవు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడ ‘కూటమి’ నేతల వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.లక్షల వ్యయంతో నిర్మించిన షెడ్లను కమీషన్‌ ఏజెంట్లకు కాకుండా వ్యాపారులకు కేటాయిస్తున్నారు. మార్కెట్‌లో గతంలో కూరగాయల వ్యాపారం నిమిత్తం షెడ్లు నిర్మాంచారు. కాని వ్యాపారులు షెడ్లలో వ్యాపారం చేయడం వల్ల వినియోగదారులు లోపలికి రావడం లేదనే కారణంతో బయటనే వ్యాపారం చేస్తున్నారు. షెడ్లలోనే కూర్చొని కూరగాయలు అమ్ముకునే విధంగా చూడాల్సిన బాధ్యత మార్కెట్‌ కమిటీపై ఉంది. షెడ్లలోనే కూరగాయల వ్యాపారం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటే ట్రాఫిక్‌ సమస్య ఉండదు. పరిశుభ్రత పెంపొందుతుంది. కాని ఇదేమీ పట్టించుకోని మార్కెట్‌ కమిటీ ఏకంగా 1వ నంబరు షెడ్‌ను మిర్చి వ్యాపారులకు స్వాధీనం చేసింది. మార్కెట్‌ యార్డుల్లో సాధారణంగా కమీషన్‌ ఏజెంట్లకు షాపులు కేటాయిస్తారు. రైతులకు, వ్యాపారులకు మధ్యన ఉండి రైతులు తెచ్చిన సరుకును అమ్మిస్తుంటారు. ఎక్కడైనా కమీషన్‌ ఏజెంట్లకు షాపులు ఇవ్వడం సర్వసాధారణం. కర్నూలు మార్కెట్‌లో మాత్రం మొదటి విడతలో మిర్చి వ్యాపారులకు 1వ షెడ్డు అప్పగించడం మార్కెట్‌ యార్డులో కొంతకాలంగా జోరుగా చర్చ సాగుతోంది.

చేతులు మారిన ముడుపులు..

మిర్చి వ్యాపారులకు షాపుల నిమిత్తం షెడ్డును కేటాయించడం ద్వారా పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు విరమ్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారాన్ని ఒక ఉన్నతాధికారి నేతృత్వంలోనే జరిగినట్లు తెలుస్తోంది. మిర్చి వ్యాపారులకు ఒక షెడ్డు అప్పగించడంతో తమకు షాపులకు షెడ్‌ ఇవ్వండి, స్థలం చూపాలని మిగిలిన వ్యవసాయ ఉత్పత్తులుకొనే వ్యాపారులు కోరుతున్నట్లు సమాచారం. మార్కెట్‌లో వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే రైతులకు నేరుగా వ్యాపారులు పేమెంటు చేయడం జరుగదు. కమీషన్‌ ఏజెంటు తన కమీషన్‌ పట్టుకొని రైతుకు పేమెంటు చేస్తారు. సరుకు కొనుగోలు చేసిన వ్యాపారులు నిర్ణీత గడువులోపు కమీషన్‌ ఏజెంటుకు పేపెంటు చేస్తారు. వ్యాపారులకు ఒక షెడ్‌ అప్పగించి షాపులు నిర్మించునేందుకు అవకాశం ఇవ్వడం వల్ల పెద్ద ప్రయోజనం సిద్ధించినట్లు తెలుస్తోంది. షెడ్‌లో బయటికి, లోపలికి 20కిపైగా షాపులు నిర్మించడం గమనార్హం. మిర్చి వ్యాపారులు అతి తక్కువ మంది ఉన్నారు. వీరికి ఒక షెడ్డు ఇవ్వడాన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఇటువంటి షెడ్లు మరిన్ని అప్పగించినా అశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

నిబంధనలకు విరుద్ధంగా

వ్యాపారులకు కేటాయింపు

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో

అస్తవ్యస్త పాలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement