
ఆశలు గల్లంతు
రాజు, మారుతమ్మలకు ముగ్గురు కుమారులు సంతానం. రాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదటి కుమారుడు సంపత్ కుమార్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రెండో కుమారుడు కారుణ్య కుమార్ 7వ తరగతి చదువుతున్నాడు. కిన్నెర సాయి (10) ఐదో తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడిపై తండ్రి రాజు ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. అయితే కిన్నెర సాయి మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు.
మాకు ఎవరు దిక్కు?
మమత, మహారాజు దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు సాయి కిరణ్ (10) ఐదో తరగతి, కుమార్తె అశ్రిత ఒకటో తరగతి చదువుతోంది. మమత, మహారాజు బెల్దారు కూలీగా పనిచేస్తూ బిడ్డలను చదివించుకుంటున్నారు. అయితే సాయి కిరణ్ నీటి కుంటలో మునిగి మృతిచెందాడు. ‘ఉన్న ఒక్క కొడుకును బాగా చదివించాలని కలలుగన్నాం. మాకు ఎవరు దిక్కు’ అంటూ వారు రోదించారు.