ఆకాశం వైపు చూస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాటపాడారు. చెట్టుపై చిలకను చూస్తూ ‘చిట్టి చిలకమ్మ..అమ్మ కొట్టిందా’ అని పద్యం వల్లెవేశారు. అడుగులు అటూ ఇటూ వేస్తూ గణితంలో కూడికలు, తీసివేతలు చేశారు. ‘సోషియల్‌’ పాఠాన్ని విన్న ఆనందంతో చేను గట్ల వెంట పరుగుత | - | Sakshi
Sakshi News home page

ఆకాశం వైపు చూస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాటపాడారు. చెట్టుపై చిలకను చూస్తూ ‘చిట్టి చిలకమ్మ..అమ్మ కొట్టిందా’ అని పద్యం వల్లెవేశారు. అడుగులు అటూ ఇటూ వేస్తూ గణితంలో కూడికలు, తీసివేతలు చేశారు. ‘సోషియల్‌’ పాఠాన్ని విన్న ఆనందంతో చేను గట్ల వెంట పరుగుత

Aug 21 2025 6:56 AM | Updated on Aug 21 2025 6:56 AM

ఆకాశం

ఆకాశం వైపు చూస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాట

ఆస్పరి/ఆలూరు రూరల్‌: రోజు మాదిరిగానే తల్లిదండ్రులు తమ పిల్లలను ముస్తాబు చేసి యూనిఫాం తొడిగించి పాఠశాలకు పంపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో చదువుకుని తిరిగి ఇంటికి వచ్చిన ఆ చిన్నారులు సరదాగా ఈత కోసం గ్రామ సమీపంలోని నీటి కుంటకు వెళ్లారు. ఈత రాక మునిగి ప్రాణాలు వదిలారు. పొలం పనులకు వెళ్లి తిరిగిగొచ్చిన ఆ తల్లిదండ్రులు.. విగతజీవులైన పిల్లలను చూసి గుండెపగిలేలా రోదించారు. ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న వినయ్‌, భీమేష్‌, మహబూబ్‌ బాషా, సాయి కిరణ్‌, శశి కుమార్‌, కిన్నెర సాయి, దుర్గా ప్రసాద్‌లు కలిసి బుధవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లారు. పక్కనే ఇటీవల నిర్మించి ఆగస్టు 15న ప్రారంభించిన ఉన్నత పాఠశాల గురించి చర్చించుకున్నారు. ‘మనం ఏడో తరగతికి ఇక్కడికే రావాలి’ అనుకున్నారు. సరదాగా ఈత కొట్టేందుకు నీటి కుంటలో దిగారు. దుర్గా ప్రసాద్‌ ఒడ్డున ఉండగా మిగిలిన ఆరుగురు విద్యార్థులు ఈత రాక నీటి కుంటలో మునిగి పోయారు. గమనించిన దుర్గాప్రసాద్‌ అక్కడి నుంచి పరుగుపెడతూ గ్రామానికి చేరుకుని జరిగిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. గ్రామ యువకులు కుంట వద్దకు చేరి విద్యార్థులను వెలికి తీశారు. ఇందులో కిన్నెర సాయి కొన ఊరితో ఉండగా ఆదోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. మిగిలిన ఐదుగురు విద్యార్థులు కుంటలోనే ప్రాణాలు వదిలారు.

పేదింటికి మరింత కష్టం

గడ్ల పెద్ద ఈరన్న, మల్లమ్మలు ప్రతి రోజూ కొండకు వెళ్లి రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె గాయత్రి, రెండో కుమారుడు వినయ్‌ (10), మూడో కుమారుడు అభి ఉన్నారు. ఇద్దరు కుమారులను బాగా చదివించి ప్రయోజకులని చేస్తే తమకు కష్టాలు తీరుతాయనుకున్నారు. బిడ్డలను అల్లారు ముద్దుగా చూసుకుంటూ పాఠశాలకు పంపించేవారు. పదేళ్ల వయస్సులోనే వినయ్‌ ప్రాణం పోవటంతో వారి రోదనలు స్థానికులకు కంట తడిపెట్టించాయి.

ఎవరి కోసం జీవించాలో..

రాముడు, లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. వీరికి మూడు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె మహాదేవి ఆస్పరిలో పదవ తరగతి చదువుతోంది. రెండో కూతురు రేష్మా చిగిలిలో 8వ తరగతి చదువుతోంది. ఏకై క కుమారుడు భీమేష్‌ (11)పై ఆశలు పెట్టుకున్నారు. అయితే నీటి కుంటలో పడి భీమేష్‌ మృతిచెందడంతో ‘ఎవరి కోసం జీవించాలో’ అని వారి రోదించడం అందరినీ కంట తడి పెట్టించింది.

ఆరిపోయిన కలల దీపం

పీరావలి, జిలేఖా బీ దంపతుల కూతురు పర్విన్‌ కూలీ పనికి వెళ్తోంది. పీరా వలి ఆదోనిలో గౌండపనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకు ఉన్న ఏకై క కుమారుడు మహబూబ్‌ బాషా (10)పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పెద్ద చదువులు చదివి కుటుంబానికి అండగా ఉంటాడని ఆశించారు. అయితే కుమారుడు నీటి కుంటలో పడి మృతిచెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

విషాదమే మిగిలింది

నాగవేణి, కిష్టప్ప దంపతులకు ముగ్గురు కుమారులు. కిష్టప్ప ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుడు కిరణ్‌ కుమార్‌ పదో తరగతి, రెండవ నితీష్‌ కుమార్‌ 9వ తరగతి చదువుతున్నారు. చివరి కుమారుడు శశి కుమార్‌ మృతిచెందడంతో వారింట్లో విషాదమే మిగిలింది.

నీటి కుంటలో మునిగి

ఆరుగురు విద్యార్థులు మృతి

చిగిలి గ్రామంలో తీవ్ర విషాదం

మృతిచెందిన విద్యార్థుంతా

ఒకే తరగతికి చెందిన వారే

అల్లారు ముద్దుగా పెంచిన

కుమారుల మృతితో

శోకసంద్రంలో తల్లిదండ్రులు

ఆకాశం వైపు చూస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాట1
1/6

ఆకాశం వైపు చూస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాట

ఆకాశం వైపు చూస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాట2
2/6

ఆకాశం వైపు చూస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాట

ఆకాశం వైపు చూస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాట3
3/6

ఆకాశం వైపు చూస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాట

ఆకాశం వైపు చూస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాట4
4/6

ఆకాశం వైపు చూస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాట

ఆకాశం వైపు చూస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాట5
5/6

ఆకాశం వైపు చూస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాట

ఆకాశం వైపు చూస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాట6
6/6

ఆకాశం వైపు చూస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement