
‘రెవెన్యూ’ సమస్యలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(సెంట్రల్): రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో రెవెన్యూ, సర్వే అంశాలపై సబ్ కలెక్టర్, ఆర్‌డీఓ, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌లో వచ్చే అర్జీల్లో 80 నుంచి 85 శాతం వరకు రెవెన్యూకు సంబంధించినవే ఉన్నాయన్నారు. రీసర్వే సమస్యలతోపాటు సర్వేయర్లు ఫీల్డ్‌కు వెళ్లడంలేదని, చెప్పకుండా సర్వే చేస్తున్నారని, డబ్బులు అడుతుతున్నారని అనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. కర్నూలు ఆర్‌డీఓ కార్యాలయం, సీ బెళగల్, గోనెగండ్ల, కోడుమూరు తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారుల నుంచి సంతృప్తికరమైన పరిష్కా రాలు లభించడంలేదని ప్రజలు ఐవీఆర్‌ఎస్‌లో ఫీడ్ బ్యాక్ ఇచ్చారన్నారు. ప్రతి శుక్రవారం ఓ మండలంలో గ్రీవెన్స్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి శనివారం ఆర్‌ఓఆర్ కోర్టులను నిర్వహించి 20 కేసులను పరిష్కరించాలని సబ్ కలెక్టర్, ఆర్‌డీఓలను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు జాప్యం లేకుండా ప్రయోజనాలు కల్పించాలన్నారు. దలకు ఇచ్చే స్థలాల కోసం భూములను గుర్తించాలని ఆదేశించారు. జేసీ డాక్టర్ బి.నవ్య ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ సి.వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అజయ్‌కుమార్, కర్నూలు, పత్తికొండ ఆర్‌డీఓలు సందీప్‌కుమార్, భరత్‌నాయక్ పాల్గొన్నారు.
వచ్చే వారం నుంచి ‘పల్లెకుపోదాం’
గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారం నుంచి పల్లెకుపోదాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా తెలిపారు. సునయన ఆడిటోరియంలో బుధవారం ఉదయం స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి నెలలో ఒకసారి పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 80 మంది జిల్లా అధికారులను గుర్తించి ప్రత్యేకాధికారులుగా నియమించామన్నారు. ముందు రాత్రి మాత్రమే ఏ గ్రామానికి వెళ్లాలి అనే సమాచారాన్ని అధికారులకు తెలియజేస్తామన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు తమ బృందాలతో ప్రత్యేకాధికారి వెంట వెళ్లాల్సి ఉంటుందన్నారు.
అధికారులను ఆదేశించిన
జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా