
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.35 కోట్లు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.3,35,31,756 వచ్చింది. బుధవారం స్థానిక రాజాంగణ భవనంలో శ్రీమఠం హుండీ కానుకలు లెక్కగట్టారు. 20 రోజులకుగానూ హుండీల్లో కానుకలను లెక్కించగా నగదు రూ.3,24,52,256, నాణేలా రూపంలో రూ.10,79,500 సమకూరింది. అంతేగాక 1140 గ్రాముల వెండి, 74 గ్రాముల బంగారు వచ్చినట్లు మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు.
‘యూరియా’ తనిఖీలకు ప్రత్యేక బృందం
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయేతర అవసరాలకు యూరియా వినియోగిస్తున్నారా అనే దానిని గుర్తించేందుకు జిల్లా అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు అయ్యింది. ఈ బృందం సభ్యులు కల్లూరు, కర్నూలు, ఆదోని, కోడుమూరు, వెల్దుర్తి, నందవరం, హొళగొంద, ఆస్పరి మండలాల్లోని పౌల్టీ, మిల్క్, ఇతర పరిశ్రమల్లో యూరియా వినియోగంపై తనిఖీలు చేపడతారు. వారం రోజుల పాటు తనిఖీలు జరుగుతాయి.
ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్
● సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు
కర్నూలు కల్చరల్: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. నెలలుగా నిరీక్షిస్తున్న విద్యార్థులు ఆలస్యంగా డిగ్రీ కళాశాలల్లో చేరబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యపై పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలకు జాప్యం జరిగినట్లు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీలో చేరేందుకు బుధవారం ఉన్నత విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ అడ్మిషన్స్ మోడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజేస్ (ఓఏఎమ్‌డీసీ) ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 25 నుంచి 28వ తేదీ వరకు స్పెషల్ క్యాటగిరీ విద్యార్థులకు వెరిఫికేషన్, 24 నుంచి 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, 29న వెబ్ ఆప్షన్లలో మార్పు చేసుకోవడం, 31వ తేదీ కళాశాలలో సీట్ల కేటాయింపు, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రాయలసీమ యూనివర్సిటీ పరిఽధిలో మొత్తం 82 డిగ్రీ కళాశాలలు ఉండగా అందులో 14 ప్రభుత్వ, 68 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
నీటిని విడుదల చేయాలి
కర్నూలు సిటీ: కల్లూరు మండలం కె.మార్కాపురం గ్రామం వద్ద ఉన్న చెన్నరాయునితిప్ప రిజర్వాయర్‌ను గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని నింపి, ఆయకట్టుకు నీరు అందించేందుకు పంట కాలువలు తవ్వాలని కోరుతూ ఏపీ రైతు సంఘం నాయకులు బుధవారం జల వనరుల శాఖ కర్నూలు సర్కిల్ డిప్యూటీ ఎస్.ఈ డి. మల్లికార్జున రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల క్రితం రిజర్వాయర్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, కానీ నీటి సదుపాయం కల్పించలేదన్నారు. రిజర్వాయర్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు చుక్క నీరు కూడా ఇవ్వలేదని, ఈ ఏడాది భారీగా వర్షాలు కురుస్తున్నాయని, వరద నీరంతా సముద్రంలో కలుస్తుందన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి రిజర్వాయర్‌కు నీటిని అందించాలని, ఆ నీరు ఆయకట్టుకు అందించేందుకు పంట కాలువలను తవ్వాలని కోరారు.
శ్రీశైలంప్రాజెక్ట్: కృష్ణానది ఉరకలు వేస్తూ నాగార్జున సాగర్‌పై వైపు బిరబిర సాగుతోంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. గంటగంటకు వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. దీంతో తెరచి ఉంచిన 10 రేడియల్ క్రస్ట్‌గేట్లను బుధవారం 18 అడుగులకు పెంచారు. స్పిల్‌వే ద్వారా 4,22,100 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. మంగళవారం నుంచి బుధవారం వరకు జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి శ్రీశైలంకు 4,53,858 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 4,27,466 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రస్ట్‌గేట్ల ద్వారా 3,25,237, విద్యుత్ ఉత్పాదన అనంతరం 69,411 క్యూసెక్కుల నీ టిని నాగార్జునసాగర్‌కు వదిలారు. పోతిరెడ్డిపా డు ద్వారా 30,000, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,818 క్యూసెక్కుల నీరు వదిలారు.