
మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్య్రం
కర్నూలు(టౌన్): ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్య్రం అని, ప్రతి ఒక్కరూ వారిని స్మరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, నగర మేయర్ బీవై రామయ్య, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయమనోహరి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేశారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పాలనను గ్రామస్థాయికి చేర్చి ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.