
రమణీయం.. ఉట్లోత్సవం
● శ్రీమఠంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
మంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో శనివారం ఉట్లోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల స్వయంగా ఉట్టి కొట్టి అందరిలో భక్తిభావాన్ని నింపారు. ఉత్సవాల సందర్భంగా శ్రీకృష్ణుడి మూలవిరాట్‌కు పీఠాధిపతి విశిష్ట పూజలు చేశారు. సాయంత్రం శ్రీ మఠం మధ్వ కారిడార్‌లో ఉట్లోత్సవం కార్యక్రమం చేపట్టారు. రంగు నీళ్లు చల్లుకుంటూ వైభవంగా ఉట్లోత్సవం కొనసాగింది. ఘనంగా నిర్వహించిన కృష్ణాష్టమి ఉత్సవాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

రమణీయం.. ఉట్లోత్సవం