
దేశభక్తి ప్రతిబింబించేలా..
జెండా పండుగకు పిల్లలూ.. పెద్దలూ ఉత్సాహంగా.. ఉల్లాసంగా సన్నద్ధమ వుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దేశభక్తి, జాతీయ భావం ఉట్టిపడేలా ఏర్పాట్లలో అందరూ నిమగ్నమ య్యారు. ఓ వైపు జెండా ప్రదర్శనలు, మరో వైపు మూడు రంగుల జెండాలు, ఆకట్టుకునే అలంకరణ సామగ్రి తదితర వస్తువుల అమ్మకాలతో కర్నూలు నగరంలో సందడి నెలకొంది.
– సాక్షిఫొటోగ్రాఫర్, కర్నూలు
జాతీయ పతకాలు, అలంకరణ సామగ్రి కొనుగోలు చేస్తున్న దృశ్యం
దుకాణం వద్ద త్రివర్ణ రంగుల వస్తువుల అమ్మకాలు
కలెక్టరేట్ వద్ద మాంటిస్సోరి విద్యార్థుల ప్రదర్శన