ప్రజాస్వామ్యంలో పులివెందుల ఎన్నికలు అపహాస్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంలో పులివెందుల ఎన్నికలు అపహాస్యం

Aug 15 2025 7:08 AM | Updated on Aug 15 2025 7:08 AM

ప్రజాస్వామ్యంలో పులివెందుల ఎన్నికలు అపహాస్యం

ప్రజాస్వామ్యంలో పులివెందుల ఎన్నికలు అపహాస్యం

కర్నూలు (టౌన్‌): బూత్‌లను ఆక్రమించి, దాడులకు తెగబడి, దౌర్జన్యాలు చేసి, అక్రమ కేసులు నమోదు చేసి, గృహనిర్బంధాలకు పాల్పడి పులివెందులలో ఎన్నికలు నిర్వహించి రాష్ట్రప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌ రెడ్డి విమర్శించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పులివెందులలో ప్రజలు తమ ఓట్లు తాము వేసుకుంటామని పోలీసుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదన్నారు. ఓటర్లను భయాభ్రాంతులకు గురిచేసిన టీడీపీ గుండాలు బూ త్‌లను ఆక్రమించుకొని రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నారు. అన్ని పత్రికలు, టీవీ చానళ్లలో, సోషల్‌ మీడియాలో టీడీపీ ఆగడాలు స్పష్టంగా కనిపించాయన్నారు.

అంతటా టీడీపీ గూండాల దౌర్జన్యం

వైఎస్సార్‌ జిల్లాకు సంబంధం లేని మంత్రి పులివెందుల బూత్‌లలో ఏం పని అని ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. దగ్గరుండి స్లిప్పులు లాక్కొని టీడీపీకి ఓట్లు వేయించారని ఆరోపించారు. మంత్రి సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్‌ను బట్టలు చించి దాడులకు తెగబడలేదా అని ప్రశ్నించారు. ఓటు ఉన్న వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని ఉదయం 5 గంటలకే పోలీసులు అరెస్టు చేశారన్నారు. పులివెందులలో టీడీపీకి 6 వేలకు పైగా ఓట్లు, వైసీపీకి 600 ఓట్లు రావడం వింతగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను ఓట్లు వేయకుండా టీడీపీ గూండాలు కట్టెలు పట్టుకొని కాపాలా కాయలేదా అని ప్రశ్నించారు. అసలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదన్నారు. దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ గుండాలు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచినట్లు సంకలు గుద్దుకోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అరాచాకాలకు, దౌర్జన్యాలకు పాల్పడిందన్న విషయం ప్రజలందరికీ అర్థమైందన్నారు.

రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో

భయానక వాతావరణం

రాష్ట్రంలోనే పోలీసు వ్యవస్థ చచ్చిపోయిందని రెండు నిముషాలు సమావేశంలో మౌనం పాటించారు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు ప్రజలకు భరోసాగా ఉండాలింది పోయి లా అండ్‌ ఆర్డర్‌ను మరచిపోయి కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా వ్యవహరించారని ఎస్వీ మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలను చంపేందుకేనా డీఎస్పీకి తుపాకీ ఇచ్చిందని ప్రశ్నించారు. కాల్చేస్తానని డీఎస్పీ స్థాయి అధికారి బెదిరించడం పోలీసు ప్రతిష్టకే మచ్చ అన్నారు. కురు క్షేత్ర యుద్దంలో శిఖండిలను అడ్డు పెట్టుకొని గెలవడం సిగ్గుచేటైన విషయమన్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో భయానక వాతవరణంలో ఎన్నికల నిర్వహించడం కన్నా .. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని అడిగి ఉంటే రెండు జెడ్పీటీసీలను ఇచ్చే వాడు కదా అన్నారు. స్వతంత్ర సంస్థ ఎన్నికల కమిషన్‌కు అరాచాకాలను, దాడులను ఫొటోలు, వీడియోలతో సహా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపొవడం దారుణమన్నారు.

సుమోటోగా తీసుకుని

ఎన్నికలు రద్దు చేయాలి

కూటమి ప్రభుత్వ ఆగడాలను కోర్టులు సుమోటోగా తీసుకుని పులివెందుల ఎన్నికలను రద్దు చేయాలని కోడుమూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ ఆదిమూలపు సతీష్‌ డిమాండ్‌ చేశారు. ఓటుకు నోటు, ఈవీఎంల టాంపరింగ్‌లో టీడీపీ అధినేత సిద్ధహస్తుడని ఆరోపించారు. అదే తరహాలోనే పులివెందుల ఎన్నికల్లో అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడి గెలిచారన్నారు. పులివెందులలో రాక్షస కాండను ప్రజలు గమనించారన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్‌, కార్పొరేటర్లు కృష్ణకాంత్‌ రెడ్డి, విక్రమసింహారెడ్డి, షాషావలీ, పార్టీ నాయకులు కిషన్‌, రైల్వే ప్రసాద్‌, ఫిరోజ్‌లు పాల్గొన్నారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చచ్చిపోయింది!

మంత్రి సమక్షంలో వైఎస్సార్‌సీపీ

ఏజెంట్లపై దాడులు చేశారు

కోర్టులు సుమోటోగా తీసుకుని

ఎన్నికలను రద్దు చేయాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

ఎస్వీమోహన్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement