
మద్యం బార్లకు అధిక దరఖాస్తులొచ్చేలా చూడండి
కర్నూలు: మద్యం బార్ల పాలసీ నెలాఖరుకు ముగుస్తున్నందున కొత్త పాలసీ గురించి వ్యాపారులకు వివరించి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చేలా చర్యలు తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చూడాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి ఎకై ్సజ్ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. స్థానిక డీసీ కార్యాలయంలో బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్లతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున ఇందుకు సంబంధించి మద్యం వ్యాపారుల నుంచి రుసుం వసూలు చేయాలన్నారు. లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలు ఉన్న దుకాణాల నుంచి రూ.5 లక్షలు, రూ.65 లక్షలకు పైగా లైసెన్స్ ఫీజు ఉన్న దుకాణాల నుంచి ఏడాదికి రూ.7.50 లక్షలు పర్మిట్ రూమ్‌లకు రుసుం వసూలు చేయాలన్నారు. అలాగే నాటుసారాను సమూలంగా నిర్మూలించడానికి ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమంపై చర్చించారు. కర్నూలును సారా రహిత జిల్లాగా నెలాఖరుకు ప్రకటించాల్సి ఉన్నందున ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, ఎకై ్సజ్ కర్నూలు, నంద్యాల జిల్లా అధికారులు మచ్చ సుధీర్ బాబు, రవికుమార్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రామకృష్ణా రెడ్డి, రాముడు, రాజశేఖర్ గౌడు, సీఐలు చంద్రహాస్, రాజేంద్ర ప్రసాద్, జాన్ సైదులు మంజుల, రమేష్ రెడ్డి, లలితా దేవి, స్వర్ణలత, రామాంజినేయులు, మోహన్ రెడ్డి, విజయ్ కుమార్, వరలక్ష్మి, సతీష్ తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
ఎకై ్సజ్ నేర సమీక్ష సమావేశంలో
నోడల్ డిప్యూటీ కమిషనర్

మద్యం బార్లకు అధిక దరఖాస్తులొచ్చేలా చూడండి