
రూ. 5లక్షల నగదు అపహరణ
ఆలూరు రూరల్: బ్యాంకు నుంచి డ్రా చేసుకొని వెళ్తున్న రూ.5 లక్షల నగదుతో పాటు 5 గ్రాముల బంగారు కమ్మలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. స్థానిక బళ్లారి రోడ్డులోని పాండురంగ స్వామి ఆలయ సమీపంలో కట్టెల మిషన్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడు గోపాల్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. హాలహర్వి మండలం మల్లికార్జున పల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి నెల క్రితం గాలిమరల సంస్థకు పొలం విక్రయించాడు. ఆ నగదు తన ఖాతాలో జమ కావడంతో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆలూరు స్టేట్ బ్యాంకు నుంచి రూ.5 లక్షల నగదు డ్రా చేసుకున్నాడు. నగల దుకాణం నుంచి కొనుగోలు చేసిన 5 గ్రాముల బంగారు, డ్రా చేసుకున్న నగదు సంచిలో ఉంచి తన అల్లుడుతో కలిసి స్కూటర్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఆలూరు సమీపంలోని పాండురంగ స్వామి ఆలయం వద్ద కట్టెల మిషన్ ముందు స్కూటర్ నిలిపి నగదు, ఆభరణాలు ఉన్న సంచిని దానిపై ఉంచి మూత్ర విసర్జనకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి బ్యాగు మాయమైంది. గుర్తుతెలియని వ్యక్తులు తన నగదు,బంగారు అపహరించారని ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులకు ఆశ్రయించిన బాధితుడు