
ముంచెత్తుతున్న వర్షాలు
ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
మండలం వర్షపాతం
(మి.మీ)
కర్నూలు రూరల్ 77.2
ఓర్వకల్ 68.2
ఆస్పరి 67.2
ఆదోని 59.6
కర్నూలు అర్బన్ 56.6
వెల్దుర్తి 42.4
పెద్దకడుబూరు 38.6
కోడుమూరు 38.6
కల్లూరు 38.2
కౌతాళం 36.8
ఎమ్మిగనూరు 30.2
కర్నూలు(అగ్రికల్చర్): బంగాళఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడుతుండటంతో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 12న ఉమ్మడి కర్నూలు జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 13న నంద్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించడం గమనార్హం. 14న ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్.. 15న ఉమ్మడి జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆరెంజ్ అలర్ట్ అంటే రెండు, మూడు ప్రాంతాల్లో 115.6 నుంచి 204.4 మిమీ స్థాయిలోఅతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ఎల్లో అలర్ట్ అంటే మూడు, నాలుగు ప్రాంతాల్లో 64.5 నుంచి 115.5 మిమీ స్థాయిలో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది.
ఇప్పటికే 114.9 మి.మీ వర్షపాతం
కాగా ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 116.2 మిమీ ఉండగా.. మొదటి 11 రోజుల్లోనే 114.9 మిమీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు హొళగుంద మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షం కురిసింది.
ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
ఈ నెల 12 నుంచి భారీ నుంచి
కుండపోత వర్షాలు కురిసే అవకాశం