భక్తుల కష్టాలు కనుమా? | - | Sakshi
Sakshi News home page

భక్తుల కష్టాలు కనుమా?

Aug 12 2025 7:39 AM | Updated on Aug 12 2025 12:46 PM

భక్తు

భక్తుల కష్టాలు కనుమా?

భక్తుల కష్టాలు కనుమా? ఈరన్న స్వామి..

ఈరన్న

స్వామి..

కౌతాళం: శ్రావణ మాసం మూడో సోమవారం. దారులన్నీ ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం వైపు అన్నట్లుగా భక్తులు తరలివచ్చారు. రద్దీకి తగ్గ ఏర్పాట్లలో దేవస్థానం చేతులేత్తేసింది. అదే ట్రాఫిక్‌.. అదే అపరిశుభ్రతతో భక్తుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయానికి ఏటా సుమారు రూ. 20 కోట్ల ఆదాయం ఉన్నా సౌకర్యాలు కల్పనలో వెనుకడుగు వేస్తోంది.

● క్షేత్రానికి సమీపంలో ఎల్లెల్సీ కాల్వ ఉన్న పుణ్య స్నానాలు చేసేందుకు కాల్వ వెంట మెట్లు వంద మీటర్ల పొడువు మాత్రమే ఉన్నాయి. దేవస్థానం ముందు చూపుతో కాల్వకు ఇరువైపులా భక్తుల రద్దీకి అనుగుణంగా మెట్లు నిర్మాణం, షవర్లు ఏర్పాటు చేస్తే స్నానానికి ఇక్కట్లు తప్పేవి. శానిటేషన్‌ సిబ్బంది తగినంత మంది లేక పోవడంతో క్షేత్ర పరిధిలో ఎక్కడి చూసినా అపరిశుభ్రత కనిపించింది.

● ఓ వైపు వర్షం.. మరో వైపు ట్రాఫిక్‌, ఇంకో వైపు పంట పొలాలు ఉండటంతో భక్తులు క్షేత్రానికి కాలి నడకన వచ్చేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ట్రాఫిక్‌ మళ్లింపులో అధికారులు ముందు చూపులేక పోవడంతో ప్రతి సోమవారం ఇదే సమస్య తలెత్తుతోంది.

● కౌతాళం రూట్‌లో ఈచనహాల్‌ వరకు ట్రాఫిక్‌ జామ్‌తో హాల్వి రూట్‌లో చిరుతపల్లి వరకు, కోసిగి రూట్‌లో జుమ్మలదిన్నె వరకు, ఆదోని రూట్‌లో రెండు కి లోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

● ఉదయం 10 గంటల ప్రాంతంలో ట్రాిఫిక్‌లో ఇరుక్కున వారు సాయంత్రం ఐదు తర్వాత బయట పడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వృద్దులు,వికలాంగులు చాలా ఇబ్బందుల పడ్డారు. ట్రాఫిక్‌తో చాల మంది భక్తులు కాలనడకన పొలాల వెంట ఉరుకుందకు చేరుకోగా కొంత మంది అక్కడే పొలాల్లోనే వంటలు వండి స్వామికి నైవేద్యం సమర్పించారు.

● ట్రాఫిక్‌ కంట్రోల్‌లో కేవలం కౌతాళం సీఐ అశోక్‌కుమార్‌ వారి సిబ్బందితో పాటు కొంతమంది ఎస్సైలు మాత్రమే నియంత్రించే పని చేశారే గాని బందోబస్తు వచ్చిన ఇతర సిబ్బంది చాలా వరకు కనిపించక పోవడం గమనార్హం.

భక్తుల కష్టాలు కనుమా?1
1/2

భక్తుల కష్టాలు కనుమా?

భక్తుల కష్టాలు కనుమా?2
2/2

భక్తుల కష్టాలు కనుమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement