
కిడ్నీ మార్పిడి చేయిస్తానని మోసం చేశాడు
నంద్యాల: ‘కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నాకు మా నాన్న మిత్రుడు కిశోర్ తన సోదరుడు డాక్టర్ సునీల్ ద్వారా కిడ్నీ మార్పిడి చేయిస్తానని నమ్మించి రూ. 19.84 లక్షలు తీసుకుని మోసం చేశాడు. ఆపరేషన్ చేయించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా భయపెడుతున్నాడు’ అంటూ నంద్యాల పట్టణానికి చెందిన ధనుంజయ్ ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ను ఆశ్రయించి వినతి పత్రం అందజేశారు. సోమవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌లో 89 వినతులు వచ్చాయని, వాటిపై పూర్తిస్థా యి విచారణ చేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధి లో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను పునరావృతం కాకుండా చూడాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు.
19.84 లక్షలు తీసుకుని
బెదిరిస్తున్నాడు
నంద్యాల జిల్లా ఎస్పీని
ఆశ్రయించిన బాధితుడు