
జీవించేదెలా?
మగ్గం మీదే ఆధారపడి జీవిస్తున్నాం. కూటమి ప్రభుత్వం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు. గత నెల 119 యూనిట్లు వినియోగించినందుకు రూ.612లు బిల్లు వచ్చింది. వందల రుపాయాలు బిల్లు కట్టాలంటే ఎలా? మా కుటుంబాలు జీవించేదెలా? మా కష్టం ప్రభుత్వానికి అర్థం కావడం లేదు.
– జ్యోతి, చేనేత కార్మికురాలు
మోసం చేశారు
ఎమ్మిగనూరులో 2,500 కుటుంబాలుపైగా నేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఎన్నికల ముందు మభ్యపెట్టే హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాదైనా చేనేతలకు ఒక్క పథకాన్ని అమలు చేయలేదు. ఉచిత విద్యుత్ ఇవ్వకుండా మోసం చేశారు. కూటమి సర్కార్ తీరుతో చేనేతలు వృత్తికే దూరమవుతున్నారు.
– ఎంకే శివప్రసాద్, ఎమ్మిగనూరు

జీవించేదెలా?