
కర్నూలులో కేంద్ర బలగాల కవాతు
కర్నూలు: వినాయక చవితి, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కర్నూలులో కేంద్ర సాయుధ బలగాలు (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) ర్యాలీ నిర్వహించాయి. శనివారం పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించేందుకు, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు సాయుధ బలగాలు కవాతులో పాల్గొన్నాయి. కలెక్టరేట్ నుంచి రాజ్‌విహార్, కిడ్స్ వరల్డ్, పూలబజార్, గాంధీ చౌక్, మించిన్ బజార్, కాంగ్రెస్ ఆఫీస్ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కమాండెంట్ విజయ్ కుమార్ వర్మ, అసిస్టెంట్ కమాండెంట్ పాపారావు కీర్తి, ఇన్‌స్పెక్టర్లు బి.రాజు, భారతి, సివిల్ సీఐలు నాగరాజరావు, శేషయ్య, మన్సూరుద్దీన్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

కర్నూలులో కేంద్ర బలగాల కవాతు