
దొంగలు దొరికారు
● చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో ఈనెల 2వ తేదీన ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పట్టణ పోలీసులు ఛేదించారు. బాధితుడి బంధువు సహకారంతో అదే కాలనీకి చెందిన ముగ్గురు ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పట్టుబడిన నిందితులను శనివారం పట్టణ సీఐ యుగంధర్ అరెస్ట్ చూపించారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని హుశేన్‌రెడ్డి వీధికి చెందిన బండల వ్యాపారి సంజీవరాయుడు కూతురు పెళ్లి కోసం రూ 1.27 లక్షల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు బీరువాలో ఉంచారు. 2వ తేదీన కుటుంబీకులతో చర్చిలో ప్రార్థనకు వెళ్లారు. వారు తిరిగి వచ్చే లోపు ఇంట్లో చోరీ జరిగి నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్‌ఐ జయప్ప దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు సంజీవరాయుడుకు వరసకు కూతురు అయ్యే వరలక్ష్మీతోపాటు అదే కాలనీకి చెందిన సంతోష్, విజయ భాస్కర్, నాగేంద్ర చోరీకి పాల్పడ్డారని తెలుసుకుని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు నేరం అంగీరించడంతో పాటు చోరీ సొమ్మును అప్పగించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
సారా బట్టీలు ధ్వంసం
అవుకు: కొండమనాయినిపల్లె గ్రామంలో నాటు సారా స్థావరాలపై శనివారం ఎకై ్సజ్ అధికారులు డాడులు చేసి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ సతీష్ మాట్లడుతూ..ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది ఏడు బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో అనుమానిత ఇళ్లలో తనిఖీలు చేసి నలుగురు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే గ్రామంలోని కొండగుట్టున సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1,600 లీటర్ల సారా బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. 20 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. మునిపాటి రవిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో ఎస్‌ఐలు కమలాకర్, దౌలత్ ఖాన్‌రమేష్ బాబు స్పెషల్ టీం సభ్యులు పాల్గొన్నారు.