
కుందూ.. కనువిందు!
కుందూనదిలో నీటి ఉద్ధృతికి అలలు ఏర్పడిన దృశ్యం
వీచే గాలి.. పారే నీరు.. పండే పైరు.. ప్రకృతిలో సహజ సిద్ధమైనవి. వీటిని మనస్సుతో ఆస్వాదిస్తే మధురానుభూతి కలుగుతుంది. శ్రీశైలం జలశాయానికి వరదనీరు పోటెత్తడంతో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కుందూనదికి భారీగా నీటిని విడుదల చేశారు. పట్టణ శివారులో కుందూ వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో కొన్ని ప్రాంతాల్లో సముద్రపు అలలవలే ఎగిసి పడుతున్నాయి. ఆ దృశ్యాలు అటుగా వెళ్తున్న వారిని కనివిందు చేస్తున్నాయి. – కోవెలకుంట్ల