
యూరియా కోసం రైతుల పాట్లు
హొళగుంద: మండలానికి కేవలం 560 బస్తాల యూరియా రావడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలో సుళువాయి, సమ్మతగేరి, ముగుమానుగుంది గ్రామాలకు సంబంధించి దాదాపు 5 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈ గ్రామాలకు వేలాది బస్తాలు యూరియా అవసరముంటే సోమవారం రెండు లోడ్లు మాత్రమే వచ్చాయి. ఎవరికి పంచాలో తెలియక వీఏఏలు(విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు) తలలు పట్టుకున్నారు. కొన్ని గంటల్లోనే యూరియా పంపిణీ అయి పోయింది. మండలంలో అన్నీ గ్రామాల రైతులకు యూరియాను అందించడానికి 378 టన్నుల కోసం ఇండెంట్ పెట్టామని వ్యవసాయాధికారి ఆనంద్ లోకాదల్ చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఆ మేర యూరియాను పంపించకపోవడంతో సమస్య వచ్చింది. ప్రభుత్వం స్పందించి యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

యూరియా కోసం రైతుల పాట్లు