
ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం
కర్నూలు(సెంట్రల్): విద్యాశాఖలో ఇటీవల పదోన్నతి, బదిలీలపై వెళ్లిన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. అధికారులను కలిసినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఫ్యాప్టో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సేవాలాల్ నాయక్, భాస్కర్ విమర్శించారు. శనివారం కలెక్టరేట్ ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ధర్నాను రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ కాకి ప్రకాష్‌రావు ప్రారంభించగా జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫ్యాప్టో జిల్లా అధ్యక్ష, కార్యదర్శు లు మాట్లాడుతూ ఏడాది గడిచినా 12వ పీఆర్‌సీని నియమించలేదని, నాలుగు పెండింగ్ డీఏలు ఇవ్వలేదని, ఈపీఎఫ్, ఇతర అలవెన్స్‌లను జమ చేయడంలేద ని విమర్శించారు. 30 శాతం ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్, డీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు కరే కృష్ణ, ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యదర్శి నారాయణ, మండల విద్యాధికారుల సంఘం నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట
భారీ ధర్నా